పంచాయతీ ఎన్నికల్లో జనసేన కీలక నిర్ణయం
మమతలబు
1 నిమిషం పఠనం
పెద్దదిగా చూడండిగ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నారు అని జనసేన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ కథనంలో పొరపాటు లేదా నవీకరణ ఉందా?
మరిన్ని వార్తలు
ప్రధాన పేజీకి వెళ్లండిమతలబు ముఖ్యాంశాలు & తాజా విశ్లేషణలు
రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు ప్రధాన వార్తల కోసం మా హోమ్ పేజీని సందర్శించండి.
